చలో అసెంబ్లీ.. ఓయూ జేఏసీ అధ్యక్షుడు.. !

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వ‌యో ప‌రిమితి పెంపు స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ విషయంలో నిరసన సెగలు చెలరేగుతున్నాయి.

 Ou Jac President Elchala Dattatreya Chalo Assembly , Chalo Assembly, Ou Jac, Pre-TeluguStop.com

కాగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 58 నుంచి 61 ఏండ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ చలో అసెంబ్లీకి బయలుదేరారు.

వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.ఇక రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించాలని డిమాండ్ చేసారు.

ఇకపోతే వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బయలుదేరిన ఓయూ జేఏసీ అధ్యక్షుడు దత్తాత్రేయను విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసారు.ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటం కొనసాగుతుందని ఈ ప్రభుత్వంను గద్దె దింపే వరకు మా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube