కువైట్‌లో కరోనాతో తెలంగాణ వాసి మృతి  

Telangana Nri Kuwait Covid - Telugu Corona Positive, Covid-19, Kuwait, Niamabad Nri, Nizamabad Based Nri Dies Due To Covid In Kuwait, Telangana Nri

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది.ఇప్పటికే లక్షలమంది వైరస్ బారినపడగా.

 Telangana Nri Kuwait Covid

అదే స్థాయిలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.ఈ లిస్టులో భారతీయులు కూడా ఉన్నారు.

తాజాగా కువైట్‌లో ఓ భారతీయ కార్మికుడు కరోనాతో కన్నుమూశాడు.తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యడ్ల పౌల్‌రాజ్ అలియాస్ బాల గంగాధర్ (44) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు.

కువైట్‌లో కరోనాతో తెలంగాణ వాసి మృతి-Telugu NRI-Telugu Tollywood Photo Image

అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో బాల గంగాధర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో అతనిని తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బాల గంగాధర్ మే 28న ప్రాణాలు కోల్పోయాడు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం అతని మరణ వార్తను భారత్‌లోని కుటుంబసభ్యులకు తెలియజేశారు.కాగా … గడిచిన 24 గంటల్లోనే 719 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కువైట్‌లో వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 27,762కి చేరింది.

కోవిడ్ 19 కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో.అక్కడ మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు