ప్రారంభం అయిన మున్సిపల్‌ పోలింగ్‌  

Telangana Muncipal Elections Start - Telugu Distict Collectors, Election Comission, Muncipal Elections, Poling Booths, Trs And Bjp And Congress

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు మరియు 9 కార్పోరేషన్లకు ఎన్నికలు నేడు జరుగుతున్నాయి.దాదాపు అన్ని చోట్ల ఉదయం 9 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది.

Telangana Muncipal Elections Start

కొన్ని టెక్నికల్‌ ఇష్యూల కారణంగా రెండు మూడు పోలింగ్‌ కేంద్రాల్లో పది నిమిషాలు ఇరువై నిమిషాలు పోలింగ్‌ ఆలస్యం అయినట్లుగా వార్తలు అందుతున్నాయి.ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని పోలీసు బాస్‌లు ప్రకటించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.జిల్లా కలెక్టర్లతో ఎలక్షన్‌ కమీషన్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పోలింగ్‌ సరలిని తెలుసుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 12843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.దాదాపుగా 53.5 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.పోలింగ్‌ కేంద్రంకు 250 మీటర్ల దూరం వరకు ఎవరు ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంది.పోలింగ్‌కు గుంపులు గుంపులుగా రావద్దని, పోలింగ్‌ స్టేషన్‌ లైన్‌లో తమ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా సూచించవద్దని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

మద్యాహ్నం వరకు సగానికి పైగా తమ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది.మొదటి గంట పాటు మందకోడిగా సాగినా 10 గంటల నుండి స్పీడ్‌ అందుకుంది.సాయంత్రం 5 గంటలకు ఓటింగ్‌ పూర్తి కానుంది.

తాజా వార్తలు

Telangana Muncipal Elections Start-election Comission,muncipal Elections,poling Booths,trs And Bjp And Congress Related....