టీ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్రేక్‌

ఇటీవలే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు మరియు స్థానిక సంస్థలు జరిగిన తెలంగాణలో జూన్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నట్లుగా అంతా భావించారు.కాంగ్రెస్‌ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Telangana Mlc Elections-TeluguStop.com

అందులో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌వి కాగా, ఒకటి మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవి

ఇప్పుడు మూడు స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.ఈ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

అతి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్న తరుణంలో హైకోర్టు జూన్‌ 3 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వవద్దని మద్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

రాములు నాయక్‌, యాదవరెడ్డి, భూపతిరెడ్డిల మండలి సభ్యత్వం రద్దు విషయమై వారు కోర్టును ఆశ్రయించారు.

ఆ విషయం తేలే వరకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వవద్దని ఈసీని కోర్టు ఆదేశించింది.మరి కొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందని భావిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube