పోలింగ్ కి ముందు ఈ ప్రవాహాన్ని ఎలా అడ్డుకుంటారో ..?  

  • తెలంగాణాలో ఎన్నికలకు సంబంధించి కీలక సమయం దగ్గరకు వచ్చేసింది. రేపు పోలింగ్ తేదీ కాబట్టి ఈ రోజే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలంటే ముందుగా ఏరులై పారేది డబ్బు మద్యం. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చాపకింద నీరులా దాదాపు పూర్తి చేసేసారు. ఎన్నికల సమయంలో మద్యం షాపులు బంద్ ఉంటాయని ముందే తెలియడంతో పెద్ద సంఖ్య లో మద్యం నిల్వలను సిద్దంగా ఉంచుకుని కొంతమందికి వాటి బాధ్యతలను అప్పచెప్పారు. దీంతో తమకు కేటాయించిన పరిధిలో కుల సంఘాలు, యువజన సంఘాలు, వీధుల వారిగా పంపిణీ కార్యక్రమం జోరందుకుంది.

  • Telangana Mla Candidates Who Prepared Alcohol And Money Before Polling-

    Telangana Mla Candidates Who Prepared Alcohol And Money Before Polling

  • ఇక ఓటరుకు రూ.500 నుంచి 1000 వరకు ముట్ట చెప్పేందుకు డబ్బులు ఇప్పటికే బూత్‌ల వారిగా వెళ్ళిపోయినట్టు సమాచారం. ఎక్కడికక్కడ యువతను సమీకరించి వారికి కొందరు ఇన్‌చార్జ్‌లను నియమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బూత్‌ల వారిగా కమిటీలు వేశారు. మద్యం, డబ్బు పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం కూడా అంతే స్థాయిలో భారీ బందో బస్తు ఏర్పాటు చేయడమే కాకుండా… చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసింది.