కొత్త ఎమ్మెల్సీల భయంలో  తెలంగాణ మంత్రులు ? 

త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు వార్తలు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి.ప్రస్తుత మంత్రుల్లో చాలామందిని తప్పించి,  వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించి,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

 Telangana Ministers Tention On New Mlcs Issue Mlc Elections, Trs, Telangana, Tel-TeluguStop.com

ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇదే పరిస్థితి కొనసాగితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుకు ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు.

అందుకే ప్రస్తుత మంత్రుల్లో పనితీరు సక్రమంగా లేని వారిని, రాబోయే ఎన్నికల నాటికి పెద్దగా ఉపయోగపడరు అనుకునేవారిని, మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

        అయితే వారిలో ఎక్కువ మంది మంత్రి పదవులు పొందే స్థాయి ఉన్న వారే కావడం, మరికొంత మంది మంత్రులను చేసేందుకు ఎమ్మెల్సీలు కేసీఆర్ అవకాశం కల్పించడం ఈ పరిణామాలన్నీ ప్రస్తుత మంత్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ముఖ్యంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికైన సామాజిక వర్గాలకు చెందిన మంత్రుల లో ఈ టెన్షన్ మరీ ఎక్కువైంది.

  సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొత్త ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు.
   

Telugu Mlc, Telangana, Telangana Cm-Telugu Political News

     ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు ఆయనకు అవకాశం దొరికింది.అలాగే ఐఎఎస్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామ రెడ్డికి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు.ఆయనకు ఆర్థిక మంత్రిగా అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది.కడియం శ్రీహరి సంగతినే తీసుకుంటే,  ఆయనకు మొదటి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టారు మళ్ళీ సామాజికవర్గాల సమీకరణల నేపథ్యంలో కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

ఈ పరిణామాలన్నీ ప్రస్తుత మంత్రుల్లో ఆందోళన రేపుతున్నాయి.ఖచ్చితంగా మూడు వంతుల మందిని తప్పించే అవకాశం ఉందనే వార్తలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube