వివాదాల్లో తెలంగాణ మంత్రులు.. ఈసారి ఈయ‌న వంతు..?

అదేంటో గానీ ఈ మ‌ధ్య టీఆర్ ఎస్ మంత్రులు వ‌రుస‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.మొన్న‌టికి మొన్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఒక మ‌హిళా ఆఫీస‌ర్‌ను దుర్భాష‌లాడిన వీడియో నెట్టింల పెను దుమార‌మే రేపింది.

 Telangana Ministers In Controversy This Time Niranjan Reddy, Niranjan Reddy, Kcr-TeluguStop.com

ఇక అది మ‌రువ‌క ముందే గంగుల క‌మ‌లాక‌ర్ కాస్త టీడీపీ నినాదాన్ని ఎత్తుకోవ‌డం పార్టీలో క‌ల‌వ‌రాన్ని రేపింది.ఇక ఇవ‌న్నీ స‌రిపోవ‌న్న‌ట్టు ఇప్పుడు మ‌రో మంత్రి వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డం, అది కూడా చాలా తీవ్రమైన అంశంపై ఇలా చేయ‌డంతో ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యం ఎంత హాట్ టాపిక్‌గా న‌డుస్తుందో అంద‌రికీ తెలిసిందే.ఇదే అంశంపై అటు ప్ర‌తిప‌క్షాలు ధ‌ర్నాలు, రాస్తారోకోల‌కు దిగుతుంటే.వాటిని చ‌ల్లార్చేందుకు కేసీఆర్ ఇప్పుడు 50వేల ఉద్యోగాల నోటిఫికేష‌న్ ప్లాన్‌ను తెర‌మీద‌కు తెచ్చిన విష‌యం తెలిసిందే.కాగా ఈ అంశాన్ని కాస్త ఓ మంత్రి ప్లాప్ చేసేశాడు.

కేసీఆర్ ఎంతో జాగ్ర‌త్త‌గా సెట్ చేస్తున్న ఉద్యోగ క‌ల్పన అంశంపై మంత్రి నిర‌జంన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయి.రీసెంట్‌గా నాగర్ కర్నూల్ లో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి ఉద్యోగాల క‌ల్ప‌న‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Telugu Thousand Job, Cm Kcr, Hamali, Niranjan Reddy-Telugu Political News

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న వారంద‌రికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కుదురుతుందా అని ప్ర‌శ్నించారు.అంతే కాదు ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంద‌ని, అలాగే వానాకాలం లో వ‌చ్చే యాసంగిలో రెండున్నర నెలల దాకా ఈ హ‌హాలీ ప‌నులు న‌డుస్తాయ‌ని, కాబ‌ట్టి నిరుద్యోగులు వాటిని ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.హ‌హాలీ పనులు చేసుకుంటూ ఉంటే అంత‌కు మించిన ఉపాధి ఏముంద‌ని మంత్రిగారు చెప్పారు.దీంతో నిరుద్యోగులు, అటు ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి.ఇక ఇంత‌టి సున్నిత‌మైన అంశంపై ఇలా కామెంట్లు చేయ‌డంతో గులాబీ బాస్ కూడా కాస్త సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube