మంత్రికి జరిమానా విధించిన జీహెచ్ఎంసీ  

Telangana Minister Talasani Srinivas Yadav Fined By Ghmc - Telugu Fine, Flexi, Ghmc, Talasani Srinivas Yadav, Trs

చట్టం ముందు అందరూ ఒకటే అంటారు.కానీ బడాబాబులు మాత్రం తమ బలం, బలగంతో చట్టం నుండి తప్పించుకోవడం మనం చాలా సార్లు చూశాం.

Telangana Minister Talasani Srinivas Yadav Fined By Ghmc

కాగా తాజాగా చట్టం ముందు అందరూ సమానమే అనే మాటకు ఉదాహరణగా జీహెచ్ఎంసీ తీసుకున్న ఓ చర్య నిలిచింది.తెలంగాణ రాష్ట్రం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించడంతో ఈ వార్త రాజకీయ వర్గా్ల్లో చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లోని నెక్లె్స్ రోడ్డులో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతో ఆయన కటౌట్లు ఏర్పాటు చేశారు.ఇది తమ దృష్టికి రావడంతో బల్దియా అధికారులు శ్రీనివాస్ యాదవ్‌కు రూ.5వేల జరిమానా విధించారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ అధికారులు మండిపడుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలను బ్యాన్ చేసినా కొంతమంది నాయకులు బేఖాతరు చేస్తున్నారని వారు ఆగ్రహించారు.మంత్రులే ఇలాంటి పని చేస్తే, మిగతా రాజకీయ నాయకుల మాటేమిటీ అంటూ ప్రజలు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

Telangana Minister Talasani Srinivas Yadav Fined By Ghmc-flexi,ghmc,talasani Srinivas Yadav,trs Related....