తెలంగాణ మంత్రికి పితృవియోగం.. !

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్‌ ఈ రోజు మరణించారు.ఇక గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్‌గౌడ్ తండ్రి సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

 Telangana Minister Srinivas Goud Father Passed Away,telangana Minister, Srinivas-TeluguStop.com

ఈ క్రమంలో ఈ రోజు పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.ఇక శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి మృతికి పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌ రెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ ను కలిసి పరామర్శించారు.శోకసంద్రంలో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ తల్లి గారిని కవిత ఓదారుస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

వీరితో పాటూగా పలువురు గులాభి నేతలు కూడా శ్రీనివాస్‌ గౌడ్ ను కలసి పరమార్శించారట.ఇకపోతే తెలంగాణ ముఖ్య మంత్రి కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube