వైరల్ వీడియో: ఆట మొదలెట్టగానే కాలు జారిన మినిస్టర్..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి కబడ్డీ కూతకు వెళ్లారు కానీ ఎవరు ఊహించని విధంగా కింద పడిపోయి అందరి ఆందోళనకు కారణమయ్యారు.మంత్రి మల్లారెడ్డి వయసు 67 ఏళ్లు కానీ ఆయన మాత్రం పాతికేళ్ల యువకుడిలా ఉరుకులు పరుగులు పెడుతూ చాలా ఉత్సాహంగా ప్రవర్తిస్తుంటారు.

 Telangana Minister Mallareddy Leg Slip And Fell Down In Kabaddi Game , Minister-TeluguStop.com

ఈ వయసులో కూడా తను ఏది అనుకుంటే అది మాట్లాడుతూ.అవసరమైతే చేతల్లో చూపిస్తుంటారు.

అందుకే తెలంగాణ మిగతా మంత్రుల కంటే ఆయనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు.అయితే ప్రస్తుతం కూడా ఆయన వార్తల్లోకెక్కారు.

ఈసారి తానొకటి చేయబోతే మరొకటి జరిగింది.దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ షాక్ అవుతున్నారు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో 68 వ రాష్ట్ర స్థాయి మహిళా, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి.అయితే ఈ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్ లతో పాటు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.67 ఏళ్ల వయసులోనూ ఉడుకు రక్తంతో కుర్రాడి లాగా వ్యవహరించే మంత్రి మల్లారెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా తనలోని యువకుడిని బయటపెట్టారు.కబడ్డీ పోటీదారులను ఉత్సాహపరిచేందుకు ఆయన కోర్టు లోకి దిగి కూతకు వెళ్లారు.

అయితే దూకుడుగా ఆట ఆడేందుకు ఆయన తన కాలుని పైకి లేపారు.వయసు పైబడటం తో కాలు పైకి లేపిన మంత్రి మల్లారెడ్డి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు.వెంటనే పక్కనే ఉన్న రాజకీయ నేతలు మంత్రి మల్లారెడ్డి ని పైకి లేపారు.

ఒక్కసారిగా కింద పడిపోయిన మంత్రి మల్లారెడ్డి వెంటనే లేచి నిలబడి నవ్వుతూ కనిపించారు.దీంతో ఆయనకు పెద్దగా దెబ్బలు తగలలేదు అని స్పష్టం అయింది.అదే సందర్భంగా కబడ్డీ పోటీలు కొనసాగించాలని ఆయన చెప్పుకొచ్చారు.అనూహ్యంగా కిందపడిపోయిన మంత్రి మల్లారెడ్డి తనకు కాలు నొప్పిగా ఉందని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.

అదృష్టవశాత్తు మల్లారెడ్డి కి ఏం కాలేదు కానీ ఆరుపదుల వయసులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని తెలంగాణ ప్రజలు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube