కోడి పందాలలో కోట్లు పోగొట్టుకున్న తెలంగాణా మంత్రి  

Telangana Minister Loss 10cr In Ap Cock Fights-

 • కోడిపందాల కోసం అని ఆంధ్రప్రదేశ్ వెళ్లి కోట్లు పోగొట్టుకున్నారు తెలంగాణా మంత్రి.ఒకటి రెండు కాదు ఏకంగా 10 కోట్లు పోగొట్టుకున్నారు.ఎలా పోగొట్టుకున్నారు.

 • కోడి పందాలలో కోట్లు పోగొట్టుకున్న తెలంగాణా మంత్రి-

 • ఎందుకు.? ఏమిటి.

 • ? ఎలా.? తెలుసుకోవాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే వివరాలలోకి వెళ్తే.

 • అంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో సంబరాలు చేసుకుంటారు.చిన్నా పెద్దా అందరు కలిసి ఎంతో సరదాగా గడిపే ఒకేఒక్క పండుగ సంక్రాంతి…అయితే విదేశాలలో ఉండే వారు సైతం ఈ పండుగకి తరలి వస్తారు సొంత ఊర్లకి.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు పక్క రాష్ట్రాలలో ఉన్న ప్రజలు నాయకులు సైతం కూడా ఈ కోడి పందాలు ,సంక్రాంతి సబరాలు చూడటానికి వేలల్లో వస్తారు అయితే తెలంగాణా రాష్ట్రం నుంచీ కూడా అధికార పార్టీకి చెందినా ఓ మంత్రి ప్రతీ ఏటా ఈ పండుగకి వచ్చి కోడి పందాలాలో పాల్గొంటారు.

 • ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే.

  భారీ స్థాయిలో ఇక్కడ జరిగే కోడి పందాలలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయి.

 • ఎంతో మంది జేబులు గుల్ల చేసుకుంటారు కూడా.అయితే ఆ లిస్టులో తెలంగాణా మంత్రి కూడా చేరిపోయారు.

 • ఏకంగా ఆ మంత్రి 10 కోట్లు పోగొట్టుకోవడం పెద్ద చర్చకి దారి తీసింది.సదరు మంత్రి తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందు టిడిపిలో ఓ వెలుగు వెలిగారు కూడా.ఇప్పుడు టీఆర్ఎస్ లో మంత్రి పదవులు చేపట్టారు.

 • అయితే ఈ మంత్రికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భంధువులు ద్వారా ఏపీలో జరిగే కోడిపందాలకి వస్తు ఉంటారు.

  అయితే ఈ సారి కోడి పందాలలో సుమారు 15 కోట్లు రూపాయలు పెట్టగా దాదాపు 10 కోట్లు పోయాయని సమాచారం అయితే ఇదే విషయంపై సదరు మంత్రిని మిగిలిన మంత్రులు అడుగగా.పందాలు అన్నాక గెలుపు ఓటములు సహజం అయినా ఎప్పుడు డబ్బులు దండిగానే వచ్చేవి ఈ సారి మాత్రం పోయాయి మనకి డబ్బులు ముఖ్యం కాదు గెలుపు ఓటములు ముఖ్యం అని తెలిపారట.

 • అదీ కోట్లు పోగొట్టుకున్న మంత్రి గారి స్టొరీ.