క్లారిటీ వచ్చిందా : నాకు సీఎం అవ్వాలని లేదు !   Telangana Minister Ktr Speech About Elections     2018-11-06   18:34:05  IST  Sai M

టీఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఈ రోజు కేటీఆర్ మాట్లాడారు. తమకు రాజకీయంకంటే కుటుంబమే ముఖ్యమని, హరీష్‌రావుతో తనకు విభేదాలు లేవని.. విపక్షాలు ఆయనపై దిక్కుమాలిన ఆరోపణలు చేశాయని విమర్శించారు. మరో పదిహేనేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు.

105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమన్న కేటీఆర్‌.. డిసెంబర్‌ 11న 100 సీట్లను తామే గెలవబోతున్నామని చెప్పారు. మహకూటమి పుంజుకునే ప్రసక్తే లేదన్నారు. సెటిలర్స్‌ తమ వైపు ఉన్నారని.. అందుకే చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ ఐదు సిట్టింగ్‌ స్థానాల్లో తామే గెలుస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.