బీజేపీ విషయంలో కేటీఆర్ యూ టర్న్ ? 

తెలంగాణలో బిజెపి టిఆర్ఎస్ మధ్య ఏర్పడిన వివాదం సాధారణమైనది ఏమి కాదు.కేంద్ర బిజెపి పెద్దలు సైతం టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతోందని, విమర్శలు చేయడమే కాకుండా మత పరమైన విషయాల్లో ఎన్నో రకాల కామెంట్స్ చేశారు.

 Telangana Trs Party Kcr Ktr Bjp Ts Poltics,greter Elections,bubbaka Elections,tr-TeluguStop.com

ఇక అదే రేంజ్ లో టిఆర్ఎస్ సైతం బిజెపి మతతత్వ పార్టీ అని విమర్శలు చేయడమే కాకుండా, బిజెపి అగ్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.దుబ్బాక ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఇలా అన్నిచోట్ల  ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు.

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టిఆర్ఎస్ అదే రేంజ్ లో బీజేపీ ని పూర్తిగా టార్గెట్ చేసుకుంది.కానీ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించింది.

Telugu Amith Sha, Bandi Sanjaya, Central, Dubbaka, Ghmc, Modhi, Telangana, Tharu

ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దలను కలవడం,  ఆ తర్వాత నుంచి బిజెపి విషయంలో టిఆర్ఎస్ సానుకూలంగా ఉండటం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.బీజేపీతో తమకు శత్రుత్వం ఏమి లేదు అన్నట్లుగా టీఆర్ఎస్ వైఖరి కనిపించింది.తెలంగాణ సీఎం కేసీఆర్ అదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండగా, ఇప్పుడు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇప్పుడు బీజేపీ విషయంలో అనుకూలంగా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రజలు హర్షిస్తారు అంటూ చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చివరకు కేంద్రం తెలంగాణ విషయంలో అన్యాయం చేస్తోందని, పెద్ద ఎత్తున విమర్శలు చేసిన టిఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా బీజేపీ విషయంలో యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఎన్నికలప్పుడే ఒకరిపై ఒకరు విమర్శలు ఉంటాయని, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కలిసి సమిష్టిగా పని చేసుకుందాం అంటూ కేటీఆర్ మాట్లాడడం సంచలనంగా మారింది.ఒకవైపు బిజెపి నాయకులు దూకుడుగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ బిజెపి విషయంలో దూకుడుగా వెళ్లేందుకు టిఆర్ఎస్ ఇష్టపడటం లేదు.పైగా బీజేపీ తో స్నేహంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నామనే సంకేతాలు ఇస్తూ ఉండడం అనేక సందేహాలకు కారణంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube