మంత్రులను టెన్షన్ పెడుతున్న కేటీఆర్ ?- Telangana Minister Ktr New Cabinet Issue

KTR putting tension on ministers with his new cabinet, TRS, KCR, KTR, cabinet, ministers, new telangana cm, ugadi, ktr cm, new cabinet, tension, kavitha - Telugu Kavitha, Kcr, Ktr, Ktr Cm, Ministers, New Cabinet, New Telangana Cm, Telangana, Tension, Trs, Trs Government, Ugadi

తెలంగాణ కు కాబోయే సీఎంగా కేటీఆర్ పేరు మారుమోగుతోంది.అది ఇప్పటి నుంచి కాదు.

 Telangana Minister Ktr New Cabinet Issue-TeluguStop.com

ఎప్పటి నుంచో.కేటీఆర్ సీఎం కాబోతున్నాడు అంటూ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి.

రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ చర్చ నడుస్తూ వస్తోంది.ఇప్పుడు కేటీఆర్ సీఎం అయ్యే ముహూర్తం అతి సమీపం లోకి వచ్చేసింది.

 Telangana Minister Ktr New Cabinet Issue-మంత్రులను టెన్షన్ పెడుతున్న కేటీఆర్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేటీఆర్ సీఎం గా పట్టాభిషేకం చేసిన వెంటనే , టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండడంతో, ప్రస్తుతం ఉన్న మంత్రులలో టెన్షన్ పెరిగిపోతుంది.ఎందుకంటే కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్న మెజారిటీ మంత్రులను తప్పించి, పూర్తిగా తన వారిని మంత్రులుగా చేయబోతున్నారనే  హడావుడి ప్రస్తుతం నడుస్తోంది.

అయితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న చాలామంది పనితీరు మెరుగ్గానే ఉంది.కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులపై మాత్రమే ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అంతే కాకుండా కేటీఆర్ క్యాబినెట్ లోకి ఆమె సోదరి కవితకు స్థానం కల్పించి, కేటీఆర్ నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖను ఆమెకు కేటాయిస్తారని టిఆర్ఎస్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత క్యాబినెట్ సీనియర్ మంత్రులు చాలామంది కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.వారిలో చాలామందికి కేటీఆర్ తో సాన్నిహిత్యం అంతంత మాత్రంగానే ఉంది.అటువంటి వారిని కేటీఆర్ తప్పిస్తే టీఆర్ఎస్ లో అలజడి మరింత రేగే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా కేటీఆర్ సీఎం కాకుండానే అప్పుడే కొత్త క్యాబినెట్ మినిస్టర్ ఎవరు ? పదవులు కాబోతున్నాయి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ? ఇలా అనేక లెక్కలు తెరపైకి వస్తున్నాయి.ఈ ఏడాది ఉగాది నాటికి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయం అయిపోయిన నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆశావాహులు, అసంతృప్తి వాసుల లిస్ట్ పెరిగిపోతూ వస్తోంది.అందరికంటే ఎక్కువగా ప్రస్తుత క్యాబినెట్ మంత్రులలో ఈ టెన్షన్ మరింత పెరిగిపోతోంది.

#Ugadi #Ministers #New Cabinet #TRS Government #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు