యువ సింగర్ కు ఫిదా అయిన కేటీఆర్.. దాంతో..?!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది.ఆ ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి సరైన వేదిక, అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకుంటూ ఉంటారు కొంత మంది.

 Telangana Minister Ktr Impressed By Young Singer Sravani Singing Talent-TeluguStop.com

కేవలం ట్యాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా యాడ్ అవ్వాల్సిందే.ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ అవ్వడంతో పాటు అవకాశాలు కూడా సొంతం చేసుకుంటున్నారు చాలా మంది.

ఇలాంటి వారిలో మనం ఎంతో మందిని చూసాం.టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన దుర్గారావు తన భార్యతో వివిధ షోలలో పాల్గొనడం అలాగే క్రాక్ సినిమాలో ‘భూం బద్దల్’ పాటకు రవితేజ, దుర్గా రావ్‌ ని ఇమిటేట్ చేస్తూ స్టెప్ వెయ్యడం మనం చూశాం.

 Telangana Minister Ktr Impressed By Young Singer Sravani Singing Talent-యువ సింగర్ కు ఫిదా అయిన కేటీఆర్.. దాంతో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక ట్యాలెంట్ ఉన్న సింగర్ అద్భుతమైన పాటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఆ అమ్మాయి పాడిన పాటకు ఏకంగా తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ఫిదా అయిపోయారు అంటే నమ్మండి.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి తన మధురమైన గాత్రంతో ‘‘ రేలా రే రేలా రే.నీళ్ల‌ల్లో నిప్ప‌లే, వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో.

నా తెలంగాణ’’అనే పాటను అద్భుతంగా ఆలపించింది.ఇందుకు సంబంధించిన వీడియోను సురేంద్ర తిప్పరాజు అనే అతను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ మినిస్టర్ కేటీఆర్ ట్యాగ్ చేశారు.

అంతే కాకుండా శ్రావణి లో మంచి టాలెంట్ ఉందని, ఆమె ప్రతిభను ప్రోత్సహిస్తూ అవకాశం కల్పించేలా చూడాలంటూ అతను కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు.శ్రావణి పాడిన పాట వీడియోను చూసిన కేటీఆర్ శ్రావణికి మంచి టాలెంట్ ఉందని అభినందనలను తెలియజేశారు.అలాగే శ్రావణికి అవకాశం కల్పించాలంటూ సంగీత దర్శకులైన దేవి శ్రీ ప్రసాద్, తమన్‌ లను కూడా ఆయన కోరారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రావణి ఆలపించిన పాట వీడియోను చూసేయండి.

మీ దగ్గరలోని ఇలాంటి వారు ఉంటే వారి ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రోత్సహించండి.

#Social Media #Viral Video #Song #Ss Thaman #Sharavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు