టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిది కాదని మంత్రి హరీశ్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.