కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.. !

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పక్రియ విజయవంతంగా సాగుతుందట.ఇందులో భాగంగా ప్రతి వారు కరోనా టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.

 Telangana Medical Health Minister Vaccinated With-TeluguStop.com

ఇందులో భాగంగా నేడు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మూడో విడుతలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు ఆ పైన ఉన్న వ్యాధి గ్రస్తులకు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.

 Telangana Medical Health Minister Vaccinated With-కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కావున ఈ టీకా తీసుకోవడానికి తగిన వయస్సు, అర్హత గల వారంతా దీన్ని తమ బాధ్యతగా భావించి తీసుకోవాలని కోరారు.కరోనా వైరస్‌ను జయించాలంటే ఉన్న మార్గం వ్యాక్సిన్ మాత్రమే కాబట్టి ఈ కోవిడ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, భయాలకు లోను కాకుండా తమను తాము రక్షించుకోవడానికి, తమ వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉండడానికి తప్పకుండా తెలంగాణ ప్రజలు అందరు కరోనా టీకా ఇప్పించుకోవాలని కోరారు.

#Vaccinated #Itala Rajender #Etela Rajender #Health Minister #COvid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు