కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ?

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఉత్కంఠ కలిగిస్తూ ఉంటాయి.అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.

 Telangana, Kcr, Corona Virus, Lock Down, Wine Shop, Excise Department, Cabinet M-TeluguStop.com

అందరికంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడంలో కెసిఆర్ ప్రత్యేక శైలిని అనుసరిస్తూ ఉంటారు దేశమంతా లాక్ డౌన్ ను ఒక తేదీ వరకు విధిస్తే కెసిఆర్ మాత్రం మరికొంత కాలం వాటిని పొడిగిస్తూ వస్తున్నారు.కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తే కేసీఆర్ 7 వరకు పొడిగించారు మళ్లీ కేంద్రం 17 వరకు పొడిగింపు చేయగా కెసిఆర్ మరికొద్ది రోజులు పొడిగిస్తారా లేక యధావిధిగా కేంద్రం నిర్ణయానికి కట్టుబడతరా అనేది తేలాల్సి ఉంది.

అంతేకాకుండా కేంద్రం లాక్ డౌన్ పొడిగించినా అనేక సడలింపులు ఇచ్చింది.ముఖ్యంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ లలో కేంద్రం ఇచ్చిన సడలింపుల విషయంలో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా, కెసిఆర్ ఈ రోజు క్యాబినెట్ భేటీలో ఆ విషయాలపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కట్టడి పై కెసిఆర్ కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.

అయినా ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.కేసుల సంఖ్య అదుపులోకి రాకపోగా రెడ్ జోన్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.దీనిపై నిత్యం కెసిఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారు.ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన సడలింపులపై క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో కూడా వైన్ షాపులు యధావిధిగా తెరవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది.ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది.

కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.ఈ సమయంలో ఆ లోటును కొంతవరకైనా భర్తీ చేసుకోవాలంటే మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాల్సిందే.

Telugu Corona, Excise, Lock, Telangana, Wine Shop-Latest News - Telugu

కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే ఆ ప్రభావం ఏవిధంగా ఉంటుందన్న అంశంపై కూడా కెసిఆర్ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఏపీలో మద్యం విక్రయాల కారణంగా పరిస్థితి అదుపు తప్పింది.పెద్ద ఎత్తున జనాలు వైన్ షాపుల ముందు పెద్ద ఎత్తున చేరుకోవడం, సామాజిక దూరం పాటించక పోవడం ఇవన్నీ జాతీయస్థాయిలో వార్తలయ్యాయి.దీని కారణంగా ఏపీ ప్రభుత్వం అభాసుపాలు పాలయ్యింది.

దీనిపై పూర్తిస్థాయిలో కేబినెట్ భేటీలో చర్చించి తెలంగాణలో సడలింపులు ఇవ్వాలని కెసిఆర్ చూస్తున్నారు.దీంతో ఈ రోజు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది అందరిలోనూ టెన్షన్ కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube