లాక్ డౌన్ టైం లో బ్యాంక్ పనివేళల్లో మార్పులు..!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి KCR 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.12వ తారీఖు నుండి 21 వరకు ఈ లాక్ డౌన్ జరుగనుంది.20వ తారీఖు మరోసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి లాక్ డౌన్ కొనసాగించాలా ఎత్తివేయాలా అన్నది తెలియచేస్తారు.ఇక లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే అన్ని వ్యాపారాలు జరుగనున్నాయి.

 Telangana Lockdown Bank Timings Are Changed-TeluguStop.com

ఇక లాక్ డౌన్ టైం లో బ్యాంకుల పనివేళలు కూడా కుదించారు.ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయని తెలుస్తుంది.

ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పనివేళలు ఉంటాయని చెబుతున్నారు.బ్యాంకులు కూడా 50 శాతం సిబ్బందితోనే పనిచేయనున్నట్టు తెలుస్తుంది.

 Telangana Lockdown Bank Timings Are Changed-లాక్ డౌన్ టైం లో బ్యాంక్ పనివేళల్లో మార్పులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్యాంక్ ఉద్యోగులకు స్పెషల్ పాస్ ల ద్వారా వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.లాక్ డౌన్ టైం లో మినహాయించిన వాటికి తప్ప మిగతా వారెవరు బయటకు రాకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

తెలంగాణాలో తొలి రోజు లాక్ డౌన్ బాగానే సక్సెస్ ఫుల్ అయినట్టు తెలుస్తుంది.అయితే తొలిరోజు అవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇంకా ప్రయాణాలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.

#Lockdown #Telangana #Timings #Corona Lockdown #Changed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు