తెలంగాణలో లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. టాలీవుడ్‌పై ప్రభావం ఎంత?

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్ ను ఎత్తి వేస్తున్నట్లుగా ప్రకటించారు.దాంతో మళ్లీ టాలీవుడ్‌ లో హడావుడి మొదలు అవ్వబోతుంది.

 Telangana Lock Down Removed Effect On Tollywood , Corona, Film News, Lock Down,-TeluguStop.com

ఇప్పటికే సినిమా ల షూటింగ్‌ లు కొన్ని జరుగుతున్నాయి.సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపు ఇచ్చినప్పటి నుండి షూటింగ్ లు మరియు ఇతర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను నిర్వహిస్తూనే ఉన్నారు.

ఇక హైదరాబాద్‌ లో షూటింగ్ లకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవు.అందుకే షూటింగ్‌ లను మళ్లీ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే జులై మొదటి వారం నుండి పెద్ద ఎత్తున షూటింగ్‌ లను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా తొలగించడంతో షూటింగ్‌ లు విచ్చల విడిగా జరిగే అవకాశం ఉంది.

షూటింగ్‌ ల విషయం పక్కన పెడితే థియేటర్ల సంగతి ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

కాని ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేస్తున్నట్లుగా ప్రభుత్వం క్లీయర్ గా ప్రకటించింది.కనుక తెలంగాణలో రేపటి నుండే వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమా లు చాలా వాయిదాల మీద వాయిదాలు అన్నట్లుగా వాయిదాలు పడ్డాయి.

Telugu Corona, Full Occupancy, Lock, Mediumrange, Telangana Lock, Theaters, Toll

కనుక సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించడంతో పాటు థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే పెద్ద సినిమా లు ఆగస్టు నుండి క్యూ కట్టే అవకాశం ఉందని అంటున్నారు.జులై మీడియం రేంజ్‌ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంటున్నారు.ప్రస్తుతం థియేటర్ల గురించిన కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ప్రభుత్వం నుండి మరింత స్పష్టత వస్తే బాగుంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube