ఎల్లుండి నుండి తెలంగాణలో నో లాక్‌డౌన్‌..??

తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఎల్లుండి నుండి రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ఎత్తి వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం దశలవారీగా సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉండటంతో.

 Telangana Lock Down Latest News-TeluguStop.com

రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గడంతో ఎల్లుండి నుండి పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో కేసులు భారీగా నమోదు కావడం మాత్రమే కాక మరణాలు కూడా అదేరీతిలో సంభవించడంతో ఏప్రిల్ 21 నుండి ఆంక్షలు అమలులోకి ప్రభుత్వం తీసుకు వచ్చింది.

రాత్రి నుండి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది.అయినా గాని కరోనా అదుపులోకి రాకపోవడంతో మే 12 నుండి లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది.

 Telangana Lock Down Latest News-ఎల్లుండి నుండి తెలంగాణలో నో లాక్‌డౌన్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మొత్తం దాదాపు క్లోజ్ అవడంతో అప్పటి నుండి దశలవారీగా లాక్ డౌన్ అమలు చేస్తూ మరో పక్క సడలింపులు ఇస్తూ కర్ఫ్యూ అమలు చేయటంతో దాదాపు కరోనా పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది.అయితే లాక్ డౌన్ ప్రభావం చాలా మందిని ఇబ్బంది పెట్టడం తో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

#Corona #Lock Down #Telangana #No Lock Down #Night Curfews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు