అర్థరాత్రి యశోద హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్‌  

Telangana Cm Kcr Went On Yashodha Hospital-somaji Guda Yashodha Hospital,talasani Srinivas Yadav With Family,telangana Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు.నిన్న రాత్రి సమయంలో ఆయన సోమాజీగూడ యశోద హాస్పిటల్‌కు వెళ్లారు.

Telangana Cm KCR Went On Yashodha Hospital-Somaji Guda Hospital Talasani Srinivas Yadav With Family Kcr

కేసీఆర్‌ రాకతో హాస్పిటల్‌లో భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.జ్వరం మరియు జలుబుతో రెండు రోజులుగా బాధపడుతున్న కేసీఆర్‌ను యశోద వైధ్యులు పరీక్షించారు.

పలు టెస్టులు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని, స్వల్ప వైరల్‌ ఫీవర్‌ అంటూ తేల్చినట్లుగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

యశోద హాస్పిటల్‌కు కేసీఆర్‌ వెళ్లిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఉన్నారు.

ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ గారి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆయన స్వల్ప వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు.మున్సిపల్‌ ఎన్నికల విజయోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ గారు పాల్గొంటారు అంటూ మంత్రి ఆశా భావం వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలోనే టెస్టులు అన్ని పూర్తి అయిన తర్వాత కేసీఆర్‌ ఇంటికి వెళ్లి పోయారు.టెస్టు రిపోర్ట్‌లు నేడు ఉదయంకు అన్ని వచ్చాయి.అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యం బాగుందని వైధ్యులు తెలియజేశారు.

తాజా వార్తలు

Telangana Cm Kcr Went On Yashodha Hospital-somaji Guda Yashodha Hospital,talasani Srinivas Yadav With Family,telangana Cm Kcr Related....