కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ? కెసిఆర్ ముందు చూపు పని చేస్తోందా ?

తెలంగాణ సీఎం కెసిఆర్ ఎంతటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్న తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్ధుడు కెసిఆర్.

 Kcr Plan To Do Corona Free State In Telangana In Soon, Telangana, Kcr, Trs, Corona Virus, Telugu States, Covid 19, Kcr And Jagan-TeluguStop.com

అందుకే తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా కెసిఆర్ తనకు ఎదురు లేకుండా చేసుకోగలిగాడు.టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంటూ వస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం దాని ప్రభావానికి గురయ్యింది.మొదట్లో అన్ని రాష్ట్రాలన మించిపోయేలా కరోనా వైరస్ కేసులు తెలంగాణలో నమోదవుతు ఆందోళన కలిగించాయి.

 KCR Plan To Do Corona Free State In Telangana In Soon, Telangana, KCR, TRS, Corona Virus, Telugu STates, Covid 19, KCR And Jagan-కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ కెసిఆర్ ముందు చూపు పని చేస్తోందా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ లో ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం మిగతా రాష్ట్రాల కంటే దీటుగా కేసీఆర్ అనేక నియంత్రణ చర్యలు తీసుకున్నారు.

దాని కారణంగానే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అసలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అతి పెద్ద సవాల్ గా మారినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.అలా చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న తర్వాత కెసిఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు.మీడియా ద్వారా రకరకాల మార్గాల ద్వారా కరోనా వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు ఇస్తూ పగడ్బందీ చర్యలను తీసుకుంటూ వస్తున్నారు.

అసలు కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో కెసిఆర్ కు తెలియంది కాదు.అసలు ఈ కరోనా వైరస్ అనేది విదేశాల నుంచి ఎక్కువగా మన దేశంలోకి వ్యాప్తిచెందుతుంది అనే విషయాన్ని కెసిఆర్ ముందుగానే గుర్తించారు.అందుకే విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ఎవరు అన్న విషయాన్ని ముందుగానే లెక్క చూసుకుని వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.గత 15 రోజులుగా తెలంగాణలో ఇదే నిత్యకృత్యంగా జరుగుతూ వస్తోంది.

ఇప్పుడు 14 రోజుల పాటు గా వారిని అన్ని రకాలుగా పరీక్షించి, వారికి వ్యాధి సొకలేదు అన్న విషయం బయటికి వచ్చిన తర్వాత వారిని విడతలవారీగా ప్రతి రోజు కొంత మంది చొప్పున విడుదల చేస్తున్నారు.అంటే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో కెసిఆర్ బాగానే సక్సెస్ అయ్యారు.

ఈ విధంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో పూర్తిగా కరోనా అదుపులోకి వస్తుందనే విషయం అర్థం అవుతోంది.కాకపోతే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారి వల్లే తెలంగాణ లో వైరస్ కేసుల సంఖ్య పెరిగింది.

ఇప్పుడు వారందర్నీ క్వరంటైన్ కు తరలించడం వల్ల పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో కెసిఆర్ ముందు చూపు బాగా పనిచేస్తుంది.

ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినమైన నిబంధనలు విధిస్తూనే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు ప్రజలను గందరగోళ పరచ కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను కెసిఆర్ చేస్తున్నారు.త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రం గా తెలంగాణా మారే అవకాశం లేకపోలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube