తెలంగాణ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల..!!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతో కలసి జనసేన పార్టీ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మూడు వారాలలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్లు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

బీజేపీ ఇప్పటికే వంద స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది.జనసేనతో పొత్తు ప్రకటించిన తర్వాత 8 స్థానాలను బీజేపీ కేటాయించడం జరిగింది.

ఇక మిగిలి ఉన్న 11 స్థానాలలో కొన్ని స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఎక్కడెక్కడ జనసేన పార్టీ అభ్యర్థులు ఏఏ నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారో.జనసేన సోషల్ మీడియా విభాగంలో లిస్ట్ విడుదల చేయడం జరిగింది.కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు - నేమూరి శంకర్ గౌడ్, కోదాడ - మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం - మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే జనసేన పార్టీ అభ్యర్థుల పోటీ చేసే నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం.అంతేకాదు వారాహి యాత్ర కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీడియో వైరల్ : బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు
Advertisement

తాజా వార్తలు