సామజవరగమన సాంగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తాజాగా స్వరాలూ సమకూర్చిన చిత్రం అల వైకుంఠపురములో.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు.

 Telangana It Minister Ktr Appreciate Thaman For Samajavaragamana Song-TeluguStop.com

అలాగే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఇప్పటికే బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టి విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు కలెక్షన్ల జోరు తగ్గకుండా దూసుకుపోతోంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ఈ చిత్రంలోని ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన సామజవరగమన పాట ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

దాంతో సంగీత దర్శకుడు తమన్ ఈ పాటని గానకోకిల శ్రేయ ఘోషల్ చేత కూడా ఫిమేల్ వర్షన్ లో కూడా పాడించారు.

అయితే తాజాగా ఈ పాటపై తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ పాట విన్నటువంటి కేటీఆర్ సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా తాను ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నానని అయితే ఈ క్రమంలో విమానం కాస్త లేట్ గా వచ్చిందని ఆ సమయంలో సామజవరగమన పాటని విన్నానని అన్నారు.దీంతో ఒక్కసారిగా మనసుకు ప్రశాంతంగా అనిపించిందని అంతే గాక ఈ పాట తన మనసుకు హత్తుకునే విధంగా ఉందని అన్నారు.

Telugu Ktr Thaman, Ktr Latst, Ktr-Movie

అయితే ఈ విషయంపై తాజాగా థమన్కూడా స్పందిస్తూ ఇలాంటి ప్రశంస కేటీఆర్ నుంచి రావడం తనకు ఎంతో సంతోషం గా ఉందని అన్నారు.అంతేగాక  కేటీఆర్ గారు చేసినటువంటి ఇ ఈ కామెంట్ వల్ల సామజ వర గమన పాట మరింత సెండ్ చేసిన అవ్వడంతో పాటు ఈ పాట మరింత శక్తివంతంగా తయారైందని అన్నారు.అంతేకాక మా పాట మిమ్మల్ని ఆనందింప చేయడం చాలా సంతోషంగా ఉందని తమన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం థమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి లాయర్ సాబ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube