ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా..!

కరోనా వల్ల విద్యార్ధుల ఇబ్బందులు అంతా ఇంతా కాదని చెప్పొచ్చు.మళ్లీ కేసులు ఎక్కువ అవుతుండటంతో స్కూల్స్, కాలేజీలు మళ్లీ బంద్ చేశారు.

 Telangana Intermediate Practical Exams Postponed-TeluguStop.com

పరీక్షలు దగ్గర పడుతున్న ఇలాంటి టైంలో విద్యార్ధులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు.ఇక ఇదిలాఉంటే తెలంగాణాలో ఇంటర్మీడియెట్ వారికి జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు.

ఏప్రిల్ 7 నుండి జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను మే 29 నుండి జూన్ 7 వరకు నిర్వహించాలని బోర్డ్ నిర్ణయించింది.

పరీక్షల నిర్వహణ అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళలను కలుగచేస్తుంది.

ఇక ఇంటర్ ఫైనల్ పరీక్షలను మే 1 నుండి నిర్వహించాలని అనుకున్నారు.ప్రాక్టికల్ ఎక్సామ్స్ వాయిదా పడినా ఫైనల్ ఎక్సామ్స్ మాత్రం తప్పకుండా జరుగుతాయని.

లాస్ట్ ఇయర్ లాగా పరీక్షలు రద్దు చేసి విద్యార్ధులను పాస్ చేసే ఆలోచన లేదంటూ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.అయితే ప్రాక్టికల్ ఎక్సామ్స్ ఉంటాయని వాటికి సిద్ధమవుతున్న విద్యార్ధులకు అవి వాయిదా పడ్డాయన్న విషయం షాక్ ఇస్తుంది.

ఇలా ఎక్సామ్స్ ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు వాయిదా పడతాయో తెలియని సందిగ్ధ స్థితిలో విద్యార్ధుల మీద ఒత్తిడి పెరుగుతుందని మాత్రం చెప్పొచ్చు.మాములుగా అయితే ప్రాక్టికల్ ఎక్సామ్స్ అయ్యాక రాత పరీక్షలు ఉంటాయి.

కాని ఈసారి మాత్రం అది రివర్స్ అవుతుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube