త్రివ‌ర్ణ శోభితంగా తెలంగాణః సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో 75వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.ఈ సంద‌ర్భంగా గోల్కోండ కోట‌లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు.

 Telangana In Tricolor, Telengana, Cm Kcr , Independence Day-TeluguStop.com

అనంత‌రం పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ‌జ్రోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నామ‌ని తెలిపారు.ఆగ‌స్ట్ 8 వ తేదీ నుంచి వేడుక‌ల‌ను జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

 Telangana In Tricolor, Telengana, Cm Kcr , Independence Day-త్రివ‌ర్ణ శోభితంగా తెలంగాణః సీఎం కేసీఆర్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో భాగంగానే ప్ర‌తీ ఇంటిపై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో తెలంగాణ అంతా త్రివ‌ర్ణ శోభితంగా మారింది.

ఎంద‌రో అమ‌ర వీరుల త్యాగాల‌తో మ‌న‌కు స్వాతంత్య్రం ల‌భించింద‌ని సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌నించారు.

తుర్రేబాజ్ ఖాన్, రాంజీగోండు, పీవీ స‌హా అనేక మంది స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొన్నార‌ని తెలిపారు.ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన జవహర్‌లాల్ నెహ్రూ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వరకు మహానుభావుల సేవలు చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube