కరోనా పై తెలంగాణ లో అధ్యయనం ? దారుణమైన నిజాలు ?  

Hyderabad University, Corona Survey, Public Awareness, Masks, Social Distance, Corona awareness - Telugu Corona Awareness, Corona Survey, Hyderabad University, Masks, Public Awareness, Social Distance

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.మానవాళి అంతా ఇప్పుడు ఏదో ముప్పు బారిన పడబోతున్నాము అనే భయాందోళనలో ఉన్నారు.

 Telangana Hyderabad University Survey

ఈ కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేది కాదు అని, మరికొంత కాలం ఈ వైరస్ తో సహజీవనం చేయాల్సిందే అని, మాస్కులు, శానిటైజర్ మన జీవితంలో భాగస్వామ్యం కాబోతున్నాయి అని ఎప్పుడో నిపుణులు సూచించారు.ప్రస్తుతం భారత్ కేసులు అదుపులోకి రాకపోగా, మరింత తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణలో ఈ కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన పెరిగిపోతుంది.

కరోనా పై తెలంగాణ లో అధ్యయనం దారుణమైన నిజాలు -General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ కరోనా వైరస్ గురించి ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది అనే విషయం పై ఓ పరిశోధన జరిగింది.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం చేసిన ఈ పరిశోధనలో ఎన్నో ఆశ్చర్యకరమైన వివరాలు వెలుగుచూశాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ వైరస్ పై పెద్దగా అవగాహన లేదని, ఈ వైరస్ తమను ఏమి చేస్తుంది అనే నిర్లక్ష్యం చాలా మందిలో కనిపిస్తోందని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి విషయాలను వీరు సీరియస్ గా తీసుకోవడం లేదని, ఈ అధ్యయనంలో తేల్చారు.36 మంది క్షేత్రస్థాయిలో పరిశీలన వెళ్లగా, మరో ఆరుగురు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు వారికి సూచనలు చేశారు.

ఈ మేరకు వారంతా హైదరాబాద్ ఆనుకుని ఉండే జిల్లాలైన సంగారెడ్డి , రంగారెడ్డి జిల్లాలోని కొన్ని పల్లెటూర్లలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ , కొల్లూరు, వేల్ముల, వట్టినాగుల పల్లిలో పరిశీలనకు వెళ్లి 342 మంది ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు.

ఐదు ముఖ్యమైన అంశాలపై సర్వే చేసి దాని ఫలితాలను నమోదు చేసుకున్నారు.కరోనా వైరస్ వల్ల కలిగే నష్టాలు ఆదాయం, ఉపాధి, సామాజిక ప్రభావం ఆరోగ్యం వంటి అంశాలను ప్రజలకు ప్రస్తావించి వారి స్పందన నమోదు చేసుకున్నారు.

బాగా చదువుకున్న వాళ్ళు ఈ వైరస్ ప్రభావంపై కాస్త అవగాహనతో ఉన్నా, వైరస్ వల్ల ఎదురయ్యే పరిణామాలను, కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా వారు జనాలు ప్రభావితం చేయలేక పోతున్నారు అని, కాకపోతే కరోనా వ్యాప్తి చెందే విధానం, నియంత్రణ, రోగనిరోధకశక్తి పెంపొందించుకోవడం వంటి విషయాలపై అవగాహన ఉందని, కానీ ప్రస్తుతం కరోనా కొత్త లక్షణాలు గురించి పెద్దగా అవగాహన లేదని, పల్లె జనాలు ఎక్కువగా మూఢనమ్మకాలతో ఉన్నారని వారి అధ్యయనంలో తేల్చారు.ఈ అధ్యయనం మరో ఆరు నెలల పాటు కొనసాగించే విధంగా వారు ప్రయత్నిస్తున్నారు.

#Masks #Social Distance #Corona Survey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Hyderabad University Survey Related Telugu News,Photos/Pics,Images..