కేసీఆర్ పై రేవంత్ దూకుడు వెనుక ట్విస్ట్ ఇదే ?

రేవంత్ మళ్లీ మొదలు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదులుతూ, హడావుడి మరింతగా పెంచారు.

 Revnth Reddy More Active On Telangana Politics, Revanth Reddy, Kcr, Mallu Batti-TeluguStop.com

మొదటి నుంచి రేవంత్ ఇదే వైఖరితో ఉన్నా, ఈ మధ్య కాలంలో మరింతగా పెరిగినట్టుగా కనిపిస్తోంది.మొదట్లో ఉన్న అంత ప్రజాదరణ టిఆర్ఎస్ కు లేకపోవడం, ప్రభుత్వ విధానాలు ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించడం వంటి కారణాలతో కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో రేవంత్ మరింతగా తన విమర్శలకు పదును పెట్టడం ద్వారా, ప్రజలలో మంచి గుర్తింపు సాధిస్తున్నారు.

ఎప్పటికైనా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తానే అనే సంకేతాలు ప్రజల్లో కలుగజేస్తున్నారు.

సొంతంగా తన ఇమేజ్  పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.దీనంతటికీ కారణం ఆయన రాజకీయ భవిష్యత్తు కు బంగారు బాట వేసుకోవడంతో పాటు, కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయాలని తాపత్రయం కూడా కనిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కు తెలంగాణ లో ఆదరణ పెరిగినట్టుగా కనిపిస్తోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రభుత్వం పై కాంగ్రెస్ లీడర్ లు హడావుడి చేస్తున్నారు.

పార్టీలోని గ్రూపు రాజకీయాలను పక్కన పట్టి కెసిఆర్ పై పోరాటం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

Telugu Konda Pochamma, Mallubatti, Revanth Reddy, Telangana Cm-Telugu Political

మల్లు భట్టి విక్రమార్క ఆస్పత్రుల సందర్శన పేరుతో హడావుడి చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడలేని విమర్శలు చేస్తుండగా , ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం టిఆర్ఎస్ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ వస్తున్నారు.రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో మరింత స్పీడ్ గా ఉంటున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంపై నిజాలు నిగ్గు తేల్చాలని హడావుడి చేస్తున్నారు.

తాజాగా కొండపోచమ్మ సాగర్ కు జరిగిన నష్టాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో  హడావుడి చేస్తున్నారు.స్వయంగా కేసీఆర్ ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ పరిస్థితి ఇది అంటూ ఫోటోలు, వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు.

కొండ పోచమ్మ కథలు పేరుతో  ఆ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. కేసీఆర్ పై రేవంత్ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.

మొదటి నుంచి ఇదే వైఖరి తో ఉన్నారు.కాకపోతే ఇప్పుడు ఈ సమయంలో స్పీడ్ పెంచడానికి కారణం త్వరలోనే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి చేయబోతున్నారనే సంకేతాలే.

అధిష్టానం ఇప్పటికే రేవంత్ పేరును పరిగణనలోకి తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.సీనియర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ కు ఆ పదవి ఇచ్చేందుకు కుదరదని, తమలో ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని అధిష్టానానికి తేల్చి చెప్పేసారు.

ఈ తరుణంలో కేసీఆర్ ఎదుర్కోగల సత్తా, కాంగ్రెస్ లో  తాన ఒక్కడికే ఉంది అని నిరూపించుకునేందుకు రేవంత్ ఈ విధంగా హడావుడి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube