ఏంటి ఈ నిర్లక్ష్యం ? టీఆర్ఎస్ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ ?

తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది.అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు పైన తీవ్రస్థాయిలో మండిపడింది.

 Telangana High Court Serious On Trs Government And State Election Commission Beh-TeluguStop.com

తెలంగాణలో కరోనా పరిస్థితుల పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న మినీ పుర పోరు పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేదా అంటూ మండిపడింది.

ఎన్నికల కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తో పాటు,  రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టింది .రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని, దీనిపై తదుపరి చర్యలు ఏమిటంటు హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించగా, పరిస్థితిని సమీక్షించి దానికి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

అసలు చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఈ దాగుడు మూతలు ఎందుకని , ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి అనేది ఒక రోజు ముందు చెబితే నష్టం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది .

దీనికి సంబంధించి ఎటువంటి సూచనలు ఇవ్వడం లేదని, కానీ వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది.ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును ప్రశ్నించింది.కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే సమయం ఇంకా ఉంది కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది .అయితే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు కోర్టుకు తెలిపారు.దీంతో రెండో దశ కరోనా మొదలైనా, నోటిఫికేషన్  వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదా అంటూ ప్రశ్నించింది .అలాగే ఎన్నికల ప్రచార సమయాన్ని ఎందుకు కుదించ లేదుు అంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది .అధికారులు కరోనా కట్టడి విషయంపై దృష్టి పెట్టకుండాా , ఎన్నికల  పనుల్లో ఉన్ననారు అoటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదనిి, అధికారులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Telugu Corona Wave, Coronavirus, Covid, Curfew, Telangana, Telangana Lock, Trs-T

  రెండోదశ కరోనా మొదలైన సమయం నుంచి హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తోంది .త్వరలోనే తెలంగాణ అంతటా లాక్ డౌన్ విధించ బోతున్నారు అనేే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు  హైకోర్టు చేయడం  ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube