కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ హైకోర్టు  

Telangana High Court Says To Stop The Errum Manzil Building-

ప్రస్తుత సచివాలయం, ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చొద్దని తెలంగాణా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తో తెలంగాణా సీఎం కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.త్వరగా ఆ భవనాలను కూల్చేసి దసరా వరకు కొత్త సచివాలయం అసెంబ్లీని కడుదామనుకుంటున్న కేసీఆర్ స్పీడ్ కు హైకోర్టు బ్రేక్ వేసింది.గత నెల 27న కేసీఆర్ కొత్త సచివాలయం అసెంబ్లీ భవనాల కోసం భూమిపూజ కూడా చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో త్వరలోనే పాత సచివాలయం – ఎర్రమంజిల్ కూల్చివేతకు నిర్ణయించారు కూడా.అయితే అఖిలపక్షాలు – ప్రజాసంఘాలు హైదరాబాద్ లో భేటి అయ్యి ఈ కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశాయి కూడా.ఈ భవనాలపై తాజాగా సోమవారం దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కౌంటర్ కోసం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు గడువు ఇచ్చింది...

Telangana High Court Says To Stop The Errum Manzil Building--Telangana High Court Says To Stop The Errum Manzil Building-

ఆ తర్వాత నేరుగా వాదనలు విన్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.అయితే అప్పటివరకు కూడా కూల్చివేయకూడదని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.మరి కోర్టు కు కౌంటర్ గా కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు అన్న దానిపై అందరూ ఎదురు చూస్తున్నారు.ఇక కేసీఆర్ అనుకున్నట్లు గా త్వరగా కూల్చేసి కొత్త భవనాలను నియమించాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం కోర్టు కు చేరడం తో ఇక ఆ భవనాలను కూల్చాలా లేదా అన్నది హైకోర్టు చేతుల్లోకి వెళ్ళిపోయింది.

Telangana High Court Says To Stop The Errum Manzil Building--Telangana High Court Says To Stop The Errum Manzil Building-