తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య అనేక సమస్యలు ఉన్నాయి.తరచుగా రెండు వైపుల నుండి కొన్ని బలమైన వ్యాఖ్యలను వింటూనే ఉన్నాము.
ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్చలో పాల్గొని గవర్నర్ కార్యాలయాన్ని అసలు అధికార పార్టీ గౌరవించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాక రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఆధిపత్య పోరు సాగింది.
ప్రధాన న్యాయమూర్తి ఎదుట లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గొడవపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దీనిపై హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించిన ధర్మాసనం, గవర్నర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆమెకు కోర్టు నోటీసు ఇవ్వగలదా అని ప్రశ్నించినట్లు సమాచారం.
గవర్నర్ పనిలో కోర్టు జోక్యం చేసుకుంటే, అవసరానికి మించి కోర్టు జోక్యం చేసుకుంటోందని అంటున్నారు.
వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశానికి రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటూ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ ప్రవర్తనపై నెగిటివ్ ఇమేజ్ వస్తోంది.

గతంలో కూడా గవర్నర్లు ముఖ్యమంత్రులతో సమస్యలు పెంచుకున్నప్పటికీ, ఏ గవర్నర్ పదవిలో ఉంటూ ఒక న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదు.అది చాలదన్నట్లుగా ఓ టీవీ డిబేట్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది తమిళసై. అంతేకాదు, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే రిపబ్లిక్ టీవీలో ఆమె కనిపించడం గమనార్హం.ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఆమె.

రాజ్‌భవన్‌ను అధికార పార్టీ ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు.ఇంకొక అడుగు ముందుకు వేసిన ఆమె బడ్జెట్‌కు ఆమోదం తెలపలేదు.ఈసారి సమస్య కోర్టు దృష్టికి వెళ్లింది.బహుశా తెలంగాణలో తొలిసారి గవర్నర్‌పై పిటిషన్ దాఖలైంది.అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం “ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి, లేదా గవర్నర్ లేదా ప్రముఖమైన, అధికారాలు, విధుల నిర్వహణ చేసినప్పుడు, వారి పవర్ ను వినియోగించుకున్నప్పుడు ఏ న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.” మరి ఈ రచ్చ ఏ కొలిక్కి వస్తుందని వేచి చూడాలి.
