టీవీ 9 మాజీ సీఈవో కు షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్టు  

Telangana High Court Gave Shock To Tv9 Ex Ceo-general Telugu Updates,petition,shivaji,హైకోర్టు

టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఫోర్జరీ ఆరోపణల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న రవి ప్రకాష్ కు తెలంగాణా హైకోర్టు లో చుక్కెదురైంది. ఎలా అయినా ఈ కేసుల నుంచి బయటపడాలని భావిస్తున్న రవి ప్రకాష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రవి పై నమోదు చేసిన కేసులు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు..

టీవీ 9 మాజీ సీఈవో కు షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్టు -Telangana High Court Gave Shock To TV9 Ex CEO

అయితే ఈ పిటీషన్ పై వెంటనే విచారణ జరపాలని కోరగా దానికి న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతూ రవి ప్రకాష్ కు షాక్ ఇచ్చింది. ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులో మాజీ సి ఈ వో రవి ప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో సైబర్ పోలీసుల ముందు హాజరుకావాల్సింది గా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు రవి ప్రకాష్ మాత్రం హాజరు కాలేదు. దీనితో సైబర్ పోలీసులు మరోసారి ప్రకాష్ కు నోటీసులు జారీ చేసి ఈనెల 15 వ తేదీన అనగా ఈ రోజు 11 గంటలకు హాజరుకావాలని కోరారు. ఈ క్రమంలో రవి ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. అయితే ఈ రోజు 11 గంటల లోపు రవి ప్రకాష్ గనుక సైబర్ పోలీసుల ఎదుట హాజరు కానీ పక్షంలో అతడి పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కూడా ప్రస్తుతం పరారీలోనే ఉన్న సంగతి తెలిసిందే.