కరోనా తీవ్రతరం,హైకోర్టు కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రమైన తెలంగాణా లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణా లోని న్యాయవ్యవస్థ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.

 Telangana High Court Extended The Lock Down Till September 5th, Telangana, Coron-TeluguStop.com

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని న్యాయవ్యవస్థ మరో కొద్దీ రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పొడిగించాలి అంటూ నిర్ణయం తీసుకుంది.తాజాగా కోర్టుల లాక్ డౌన్ ను సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే అక్కడ కరోనా కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో గత కొద్దీ రోజులుగా అక్కడ న్యాయవ్యవస్థ లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే.వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కేసుల విచారణ చేపట్టాలి అంటూ కోర్టు గతంలో ప్రకటించింది.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఈ లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగిస్తూ అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.దీనితో అత్య‌వ‌స‌ర‌, తుది విచార‌ణ కేసులు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించాల‌ని జిల్లా కోర్టుల‌కు ఆ ఉత్త‌ర్వులో పేర్కొంది.

జిల్లా, మేజిస్ట్రేట్‌ కోర్టులు, ట్రైబ్యునళ్ల కోర్టుల లాక్‌డౌన్‌ ను కూడా సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

అయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహ, ఇతర జిల్లాలలోని కోర్టుల్లో మాత్రం నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ అనేవి మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే అని కోర్టు వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube