సమ్మె పై హైకోర్టు నిర్ణయం ఇదే !  

Telangana High Court Stion On Rtc Issue - Telugu Tsrtc Telangana Strike Court High Court Judge Esma Kcr Trs Party Strike Layer

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై ఇప్పటికీ ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయలేకపోయింది.ఇక ఈ సమ్మె సమస్య కాస్త హైకోర్టు కు వెళ్లడం, కోర్టు ప్రభుత్వ తీరుపై మొట్టికాయలు వేయడం జరిగిపోయాయి.

Telangana High Court Desistion On Rtc Issue

ఈ రోజు హైకోర్టు ఆర్టీసీ సమ్మె, రూట్ల విషయంలో ప్రవేటీకరణపై విచారణ జరిగింది.ఈ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ నయణమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది.ఈ విషయంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ అడ్వాకేట్ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

సమ్మె పై హైకోర్టు నిర్ణయం ఇదే -General-Telugu-Telugu Tollywood Photo Image

కోర్టు ఆదేశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు వివరించారు.

ఇక ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె చేయడం చట్ట విరుద్దామా కాదా అనే విషాన్ని తేల్చి చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా లేదా అనే విషయాన్ని చెప్పాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ ను కోరింది.ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధం అని ప్రకటించవచ్చని విద్యాసాగర్ కోర్టుకు తెలిపారు.ఆర్టీసీని1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఎస్మా పరిధిలోకి ఆర్టీసీని తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.2015లో ప్రభుత్వం మరోసారి జీవో ఇచ్చిందని లాయర్ విద్యాసాగర్‌ గుర్తుచేయగా పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో కేవలం ఆరు నెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది.హైకోర్టు చట్టానికి అతీతం కాదని, చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.

హైకోర్టు ఈ విషయంలో ఏ ప్రాతిపదికన ఆదేశించగలదని ధర్మాసనం ప్రశ్నించింది.తరువాత విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana High Court Desistion On Rtc Issue Related Telugu News,Photos/Pics,Images..

footer-test