పెరుగుతున్న కరోనా,కోర్టు కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం తో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న వార్తలు కూడా వస్తున్నాయి.

 Telangana High Court Going To  Close Due To Corona Cases , Telangana, High Court-TeluguStop.com

అయితే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా,313 మంది మృతి చెందిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో తెలంగాణా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణా హైకోర్టు ను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి హైకోర్టు మూతపడనున్నట్లుస్ సమాచారం.

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం 1500 కు పైగా కేసులు నమోదవుతూ రికార్డులు సృష్టిస్తుంది.ఈ మహమ్మారికి సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అవుతుండడం తో అందరూ కలవరపెడుతోంది.

ఇప్పుడిక గల్లీ నుంచి ఢిల్లీ వరకు కరోనా వైరస్ తాలూకూ భయాందోళనలో నెలకొన్నాయి.దానికి తోడు ఈ వైరాస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అన్న తాజా నివేదిక ప్రకారం ఈ మహమ్మారి మరింత ఉదృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ క్రమంలో తెలంగాణా హైకోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రేపటి నుంచి హైకోర్టు ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలుస్తుంది.అలానే హైకోర్టును పూర్తిగా శానిటైజేషన్ చేయాలంటూ న్యాయమూర్తులు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో హైకోర్టు లోని ఫైల్స్ అన్నింటినీ జ్యూడీషియల్ అకాడమీకి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.గురువారం నుంచి హైకోర్టు మూతపడుతున్న నేపథ్యంలో కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.కేవలం 24 గంటల్లో 22 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube