ఆ కరోనా మరణంపై హైకోర్ట్ సూటి ప్రశ్న ? చిక్కుల్లో తెలంగాణ ప్రభుత్వం ?  

Telangana Hc Madhusudhan Death - Telugu High Court, Kcr, Ktr, Madhusudhan\\'s Death, Telangana, Telangana Hc Seeks Clarity On Madhusudhan\\'s Death

తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు కోర్టు వివాదంలో చిక్కుకుంది.మొదటి నుంచి కరోనా వ్యవహారంలో కోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి.

 Telangana Hc Madhusudhan Death

ఇపపటికే కరోనా టెస్ట్ లు చేయకుండా, మరణాలను దాస్తోంది అంటూ తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ వచ్చాయి.ఎక్కువ టెస్ట్ లు చేస్తే ఏమైనా అవార్డులు ఇస్తారా అంటూ కేసీఆర్, కేటీఆర్ వంటి వారు వ్యాఖ్యానించారు.

ఇక కరోనా విషయంలో ఏదో దాపరికంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనే సందేహాలు కూడా అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలంగాణ లో ఓ వ్యక్తి మరణంపై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలవ్వడం కలకలం రేపుతోంది.

ఆ కరోనా మరణంపై హైకోర్ట్ సూటి ప్రశ్న చిక్కుల్లో తెలంగాణ ప్రభుత్వం -General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా మరణం పేరుతో వనస్థలీపురానికి చెందిన ఓ వ్యక్తి మరణాన్ని దాచడంపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది.

వనస్థలీపురానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తికి కరోనా సోకిందని ఏప్రిల్ నెలాఖరు సమయంలో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

కానీ అప్పటి నుంచి ఆయన ఆచూకీ గురించి ఏ విధమైన సమాచారం కుటుంబసభ్యులకు ఇవ్వలేదు. మధుసూదన్ కుటుంబ సభ్యులు పదే పదే ఈ విషయంపై ప్రశ్నించడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 1 వ తేదీన మరణించినట్టు సమాచారం ఇచ్చారు.

దీంతో మే 21 న తమ భర్త ఆచూకీ చెప్పాలి అని కోరుతూ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ను కోరారు మధుసూదన్ భార్య మాధవి.గాంధీ ఆసుపత్రి వైద్యులు తన భర్త చనిపోయారు అని చెబుతున్నారు అని, కానీ డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ మధుసూదన్ భార్య మాధవి కేటీఆర్ ను ప్రశ్నించింది.

అసలు కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మధుసూదన్ అంత్యక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ వివాదంపై మంత్రి ఈటెల కూడా స్పందించారు.జిహెచ్ఎంసి సిబ్బందే మధుసూదన్ అంత్యక్రియలు నిర్వహించారని సమాధానం చెప్పడంతో మధుసూదన్ భార్య ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది.హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి తన భర్త ఆచూకీ చెప్పాలని కోరారు.

దీనిపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.మధుసూదన్ కరోనాతో చనిపోయాడని అడ్వకేట్ జనరల్ కోర్టుకి తెలపడంతో, మరి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించింది.

దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారానికి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు కోర్టు కు ఏ ఆధారాలు సమర్పించాలి ? ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలి అనే సందిగ్ధంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test