లీజుకు తెలంగాణా హరిత హోటళ్లు..మీకు ఆసక్తిగా ఉందా.. !- Telangana Green Hotels For Lease Are You Interested

telangana green hotels for lease are you interested, Telangana, Tourism Department , green hotels, lease - Telugu Green Hotels, Lease, Telangana, Tourism Department

తెలంగాణ పర్యాటక శాఖ తన ఆధ్వర్యంలో హరిత హోటళ్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ హోటళ్లు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలతో పాటు జాతీయ రహదారులపై తమ సేవలు అందిస్తున్నాయి.

 Telangana Green Hotels For Lease Are You Interested-TeluguStop.com

కాగా పర్యాటక శాఖ వీటి నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడానికి తాజాగా ఒక ప్రకటన చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో తాము నిర్వహిస్తున్న పది హరిత హోటళ్లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 Telangana Green Hotels For Lease Are You Interested-లీజుకు తెలంగాణా హరిత హోటళ్లు..మీకు ఆసక్తిగా ఉందా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయాన్ని తెలంగాణ పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావు ప్రకటించారు.ఎవరైనా హోటళ్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పట్ల ఆసక్తి ఉంటే ఫిబ్రవరి 17లోపు తమ అభ్యర్థనను క్రింద ఇచ్చిన వెబ్‌సైట్ కు పంపించాలని తెలియచేస్తున్నారు.

ఇందుకోసం www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు.ఇకపోతే ఫిబ్రవరి 22న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించి అర్హులకు బాధ్యతలు ఇస్తామని పేర్కొన్నారు.కాగా వారు లీజుకు ఇచ్చే హోటళ్లు సింగోటం, సోమశిల, ఉమామహేశ్వరం, మన్ననూరు, ఈగలపెంట, గట్టమ్మ, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత మొదలగు ప్రదేశంలోని హోటళ్లను లీజు తీసుకోవడానికి అవకాశం కల్పించారు.

#Green Hotels #Telangana #Lease

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు