మహాకూటమి కామన్ మ్యానిఫెస్టో విడుదల !

టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా… ఏర్పడిన మహాకూటమి ( ప్రజాకూటమి) కి సంబంధించిన మ్యానిఫెస్టోను తాజాగా విడుదల చేశారు.తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పడిన ప్రజాకూటమికి సంబంధించిన పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు.

 Telangana Grand Alliance Release Common Manifesto-TeluguStop.com

కాంగ్రెస్, తెలుగుదేశం , తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.ఇది కేవలం ప్రజా ప్రతిపాదికన విడుదల చేశామని.

అవసరాలకు తగ్గట్లు కొత్తగా అంశాలు చేరుతాయన్నారు.ప్రజా ఫ్రంట్ కూటమికి నామకరణం చేసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో అవినీతి నిర్మూలనను ప్రధాన అంశంగా చేర్చారు.

ప్రజా ఫ్రంట్ కు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంను కన్వీనరుగా నియమించారు.ప్రజాకూటమి తరపున కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కోదండరాం ప్రకటించారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ, తొలి సంవత్సరంలో లక్షల ఉద్యోగాల భర్తీ, వికలాంగులకు 3 వేల పెన్షన్ తో పాటు ప్రస్తుతం ఉన్న కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను కొనసాగిస్తూ కొత్తగా మరికొన్ని అంశాలను జతచేయనున్నామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube