తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఒక్క నెలలోనే వెయ్యి కోట్లు..

తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం లభిస్తుంది.కేవలం ఒక్క నెలలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

 Telangana Government Treasury Gets 1000 Crore Due To Land Registration, 1000 Cro-TeluguStop.com

అది కూడా కేవలం ఒక్క శాఖ నుండే వచ్చిందట.జనవరి నెలలో పన్నుల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.

జనవరి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరాస్తులు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా 930 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చి చేరాయి.వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ద్వారా మరో 60.75 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఇందులో ఆశ్చర్యకర విషయమేమిటంటే మొత్తం ఆదాయంలో 600 కోట్లు రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల నుండే వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

వ్యవసాయ భూముల దస్తావేజులు 48 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

Telugu Permits, Taxes, Telangana-Latest News - Telugu

అయితే ఇందుకు ప్రధాన కారణం గత రెండు మూడు నెలల నుండి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.కోర్టు ఆదేశాలతో జనవరి నెలలో మళ్ళీ ప్రారంభం కావడంతో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు గతంలో ఎప్పుడూ లేని విధంగా జనవరి నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు సుమారు రూ.600 కోట్ల రూపాయలు నుంచి రూ.650 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుండేది అని అధికారులు చెబుతున్నారు.సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవైవేల వరకు దస్త్రాలు రిజిస్ట్రేషన్‌ అవుతుంటాయని చెబుతున్నారు.

కాగా గత రెండు మూడు నెలల నుండి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు అవ్వకపోవడం వల్ల జనవరి నెలలోనే కాదు వరసగా రెండు మూడు నెలలు ప్రభుత్వానికి ఇలాగే ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.2019 సంవత్సరం మార్చి నెలలో తెలంగాణ ప్రభుత్వానికి అత్యధికంగా 750 కోట్లు రూపాయలు పన్నుల రూపంలో వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube