ఏపీలో క్లాపిన్‌, తెలంగాణలో స్టార్ట్‌ కెమెరా చెప్పాల్సి ఉంది

గత రెండు నెలలుగా షూటింగ్స్‌ పూర్తిగా ఆగిపోయిన విషయం తెల్సిందే.పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత షూటింగ్స్‌కు అనుమతించాలని ప్రభుత్వాలు భావించాయి.

 Ap Govt Permission To Movie Shootings, Telangana, Film Industry, Lockdown-TeluguStop.com

కాని ఇప్పట్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లడమే తప్ప మరేం చేయలేము అంటూ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా దాదాపుగా ఎత్తి వేసిన పరిస్థితి కనిపిస్తుంది.

ఈ సమయంలోనే షూటింగ్స్‌కు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా షూటింగ్స్‌కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది.

ఈ విషయంలో సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.అయితే ముఖ్యంగా షూటింగ్స్‌ జరిగేది హైదరాబాద్‌లోనే.

కాని ఇప్పటి వరకు తెలంగాణలో షూటింగ్స్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.గతంలో రెండు సార్లు మంత్రి తలసానిని సినీ ప్రముఖులు కలిసి విజ్ఞప్తి చేసినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

దాంతో చేసేది లేక అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Ap, Lockdown, Telangana-

ఇప్పుడు ఏపీలో అనుమతులు వచ్చాయి కనుక తెలంగాణలో కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.అతి త్వరలోనే హైదరాబాద్‌లో కూడా స్టార్ట్‌ ‌ కెమెరా అనే అవకాశం ఉందని అంటున్నారు.తెలంగాణలో జూన్‌ మొదటి వారం నుండి షూటింగ్స్‌కు అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పెద్ద సినిమాలకు అనుమతులు ఇవ్వకున్నా పరిమిత సంఖ్యలో యూనిట్‌ సభ్యులతో షూటింగ్స్‌ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube