గుడ్ న్యూస్: 'హైదరాబాద్'లో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ?

భారత్ లో గడిచిన 6 నెలలుగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.

 Telangana Government Permits To Re Start Metro Rail Services, Metro Rail Servic-TeluguStop.com

వైరస్ వ్యాప్తి వల్ల మెట్రో రైళ్లు గత కొన్ని నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి.అయితే ఎట్టకేలకు వాటికి మోక్షం లభించింది.అయితే కేంద్రం అన్ లాక్ 4.0 సడలింపుల్లో భాగంగా తాజాగా మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో తెలంగాణ సర్కార్ విడతల వారీగా మెట్రో సర్వీసులను నడిపేందుకు ఆమోదం తెలిపింది.
నిన్న దేశంలోని అన్ని మెట్రో సంస్థల ఎండీలతో మెట్రో రైళ్లలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, ఇతర అంశాల గురించి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది.

ఈ వీడియో కాన్ఫరెన్స్ చర్చించిన ప్రోటోకాల్స్ గురించి చర్చ జరిగింది.మెట్రో రైళ్లలో కేంద్రం ఆమోదం తెలిపే ప్రోటోకాల్స్ ను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సి ఉంటుంది.

ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా, రైలు బోగీలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసేలా ప్రోటోకాల్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Telugu Corona Effect, Corona, Hyderabad, Metro, Metro Rail, Metro Train, Telanga

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో రైళ్లకు అనుమతులు ఇచ్చినా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తారా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతున్నా ప్రయాణికులు ప్రయాణానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

అందువల్ల ఇప్పటికిప్పుడు మెట్రో రైళ్లను నడిపినా ప్రయోజనం ఉంటుందా….? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మెట్రో రైళ్లను నడిపినా ఆయా సంస్థలకు నష్టాలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube