యుద్దానికి సిద్దం

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికి హైదరాబాద్‌ ప్రజలను వణికిస్తున్న స్వైన్‌ప్లూ గురించి పట్టించుకునేందుకు ముందుకు వచ్చింది.స్వైన్‌ప్లూను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హుటాహుటిగా వైధ్య అధికారులతో పాటు మంత్రులతో భేటీ అయ్యాడు.

 Telangana Govt Action Plan On Swine Flu Prevention-TeluguStop.com

రెండు మూడు రోజులు ఉండి వెళ్తుందిలే అనుకున్నాం కాని, ఇలా ప్రాణాలు బలికొటుందని అనుకోలేదని కేసీఆర్‌ చెప్పుకొచ్చాడు.ఇక స్వైన్‌ప్లూపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్దం చేసేందుకు సిద్దం అవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించాడు.

రాష్ట్రంలో స్వైన్‌ప్లూ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కేంద్రం నుండి వైధ్య సిబ్బంది వచ్చారు.రాష్ట్ర అధికారులతో మరియు సంబంధిత మంత్రితో కేంద్ర వర్గాలు సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోడీకి స్వైన్‌ప్లూ పరిస్థితిని వివరించినట్లుగా సమాచారం.స్వైన్‌ప్లూ నివారణకు చేపట్టబోతున్న చర్యలను కూడా మోడీకి కేసీఆర్‌ వివరించాడు.

స్వైన్‌ప్లూ వల్ల హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 21 మంది మరణించినట్లుగా తెలుస్తోంది.ఇది చిన్న విషయం కాదు.

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల వారు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.దాంతో ప్రభుత్వం సత్వర చర్చలు తీసుకోవాలని నిర్ణయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube