పిల్ల‌ల్లో కలిసిపోయిన‌ గ‌వ‌ర్న‌ర్... యాక్ష‌న్ చేస్తూ క‌రోనా జాగ్ర‌త్త‌లు!

హైద‌రాబాద్: తెలంగాణలో ఈరోజు నుంచి విద్యా సంస్థ‌లు తెరుచుకున్నాయి.చాలాకాలంగా విద్యాల‌యాలకు దూర‌మైన విద్యార్థులు ఉత్సాహంగా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు.

 Governor Tamilisai Describes Corona Care For Children, Telangana Governor, Tamim-TeluguStop.com

ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలను సంద‌ర్శించారు.విద్యార్థులకు మాస్కులు అందజేసి, కరోనా సోక‌కుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌ను తెలియ‌జేశారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పిల్ల‌ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న తల్లిదండ్రులను గ‌వ‌ర్న‌ర్ అభినందించారు.ఇటువంటి జాగ్రత్తలు భవిష్యత్తులోనూ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విద్యార్థుల‌కు ఆమె సూచించారు.

ఈ సంద‌ర్భంగా గవర్నర్ తమిళిసై కాసేపు టీచర్ గా మారిపోయి, విద్యార్థుల‌లో క‌లిసిపోయి వారితో ముచ్చ‌టించారు.పిల్లలకు, సిబ్బందికి కొవిడ్ జాగ్ర‌త్త‌ల గురించి చెప్పారు.

ప్రతి క్లాస్ రూమ్‌లో తిరుగుతూ పిల్లలను ప‌లుక‌రించారు.మాస్క్ ఏవిధంగా ధరించాలి? శానిటైజ్ ఎలా చేసుకోవాలి? త‌దిత‌ర విష‌యాల‌ను విద్యార్థుల‌కు అర్ధమయ్యేలా యాక్షన్ చేసి మరీ వివరించారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై.

Telugu Corona Care, Corona, Masks, Schools-Latest News - Telugu

స్కూళ్లు తెరుచుకోవ‌డంతో విద్యార్థుల్లో అప‌రిమిత‌మైన ఆనందం క‌నిపిస్తున్న‌ద‌న్నారు.క్లాస్ రూమ్‌లో, ప్లే గ్రౌండ్‌లో, వాష్ రూమ్‌లో ఇలా ఎక్క‌డైనా విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాలన్నారు.టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనా జాగ్రత్తలు తీసుకోవాల‌ని, పిల్ల‌లు క‌రోనా ప్రొటోకాల్ పాటించేలా వారు చూడాల‌ని గ‌వ‌ర్న‌ర్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube