దారంతా బురదమయం..లెక్కచేయకుండా గవర్నర్ ఏం చేసిందంటే?

తెలంగాణ గవర్నర్ తమిళిసై తన దైన శైలిలో దూసుకుపోతున్నారు.ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

 Telangana Governor Tamilisai Soundararajan Visited Flood Affected Areas,telangan-TeluguStop.com

అంతే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు.ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆమెదగ్గరకు వస్తున్నారు.

అంతకు ముంద తెలంగాణలోని ఏజెన్సీ ప్రాతంలో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకున్న ఆమె ఇప్పడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారికి గవర్నర్ భరోసా ఇస్తున్నారు.

రైలు మార్గంలో పర్యటిస్తున్న తమిళిసై ఖమ్మంజిల్లా అశ్వరాపురం లో పలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.పునరావాస కేంద్రాల పరిస్థితిని పర్యవేక్షించి ముందు బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను ఈఎస్ఐసీ వైద్య బృందాన్ని గవర్నర్ ఆదేశించారు.

Telugu Ashwapuram, Cm Kcr, Flood Areas, Red Cross, Telangana-Political

అశ్వాపురం గ్రామంలో ఎస్.కే.టీ పంక్షన్ హాల్ ఉన్న పునరావాస కేంద్రంనికి చేరుకున్న గవర్నర్ వరద బాధితులకు, చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టులను పంపిణీ చేశారు.వరదబాధితులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు.ప్రతిసారి గోదావరి వరదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు వారి ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ భాదితులకు హామీ ఇచ్చారు.

Telugu Ashwapuram, Cm Kcr, Flood Areas, Red Cross, Telangana-Political

వరద ప్రభావిత ప్రాంతాల్లో దారంతా బురదమయం అయినప్పటికీ లెక్కచేయకుండా వెళ్లి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు.గవర్నర్ స్వయంగా వచ్చి తమ సమస్యలు తెలుసుకుంటుండంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.ముఖ్యమంత్రులు, మంత్రులు తమని పట్టించుకోకపోయినా గవర్నర్ స్వయంగా వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ప్రజలంటున్నారు.

నాయకులు ఓట్లు అడగడానకి వచ్చినప్పుడు తప్ప మళ్లీ కనిపించరని, కానీ గవర్నర్ తమిళిసై స్వయంగా వచ్చి కష్టాలు తెలుసుకుంటున్నారన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube