తెలంగాణా సర్కార్ పెద్ద మనసు

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర ప్రభుత్వంతో ప్రతి విషయంలో గొడవ పడుతున్న తెలంగాణా సర్కార్ పెద్ద మనసు చేసుకుంది.హైదరాబాద్ లో హై కోర్టు నిర్మించుకోవడానికి జాగా ఇవ్వడానికి ఒప్పుకుంది.

 Telangana’s Land Offer For Ap High Court-TeluguStop.com

ఆంధ్రలో హై కోర్టు పెట్టుకునేంతవరకు హైదరాబాద్లో ఉండొచ్చు.హై కోర్ట్ ను విభజించాలని పార్లమెంట్లో తెరాస ఎంపీలు ప్రతి రోజు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

దీనిపై తెరాస ఎంపీలు, ఆంధ్ర ఎంపీలు గొడవలు పడుతూనే ఉన్నారు.గురువారం కూడా హై కోర్టు విభజనపై వాదోప వాదాలు జరిగాయి.

ఈ సమయంలో మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర హైకోర్ట్ కోసం జాగా, భవనం ఇవ్వడానికి తెలంగాణా సర్కార్ ఒప్పుకుందని చెప్పారు.దీన్ని ఆయన స్వాగతించారు.

విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్ట్ పూర్తిగా తెలంగాణకు చెందుతుంది.ఉమ్మడి హైకోర్ట్ ను తెలంగాణా నాయకులు ఎంతమాత్రం అంగీకరించడంలేదు.

ఈ తలనొప్పి తగ్గించుకోవాలని తెలంగాణా ప్రభుత్వం సహకరించడానికి ముందుకు వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు