ఫిష్ ప్రియులకు శుభవార్త.. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ఫెస్టివల్

ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్‌ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.వెజిటేరియన్ కంటే నాన్ వెజ్‌ను చాలామంది ఇష్టపడతారు.

 Telangana Government To Conduct Fish Food Festival From Tomorrow Details, Fish L-TeluguStop.com

నాన్ వెజ్ తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.నాన్ వెజిటేరియన్‌లో చాలా రకాలు ఉన్నాయి.

చికెన్, మటన్‌తో పాటు రొయ్యలు, పీతలు, పోర్క్, బీఫ్ మాంసం లాంటివి చాలా ఉన్నాయి.అలాగే చేపలు( Fish ) కూడా నాన్ వెజ్ కిందకు వస్తాయి.

చేపల్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.దీంతో చేపలను తినేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.

Telugu Fish, Fish Festival, Fish Items, Fish Lovers, Festival, Hanumaonda, Telan

అయితే చేపలను తినేవారి కోసం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ఫిష్ ఫెస్టివల్‌ను( Fish Festival ) ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు తెలంగాణ మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది.ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా అనేక రకాల ఫిష్ ఐటమ్స్‌ను తయారుచేయనున్నారు.మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది.విభిన్న రకాల ఫిష్ ఐటమ్స్ లభించనున్నాయి.దీంతో ఫిష్ తినేవారికి ఇది పండుగ అని చెప్పవచ్చు.

మృగశిర కార్తె కూడా రావడంతో ఈ ఫిష్ ఫెస్టివల్‌కు తెలగాణ ప్రభుత్వం( Telangana Government ) శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లో ఈ ఫెస్టివల్ నిర్వహించనుంది.

Telugu Fish, Fish Festival, Fish Items, Fish Lovers, Festival, Hanumaonda, Telan

చేపలు, రొయ్యలతో పాటు రకరకాల సాంప్రదాయ వంటకాలతో ఘుమఘమలాడే వంటలు చేయనున్నారు.చేపల పులుసు, వేపుడు, బిర్యానీ, కర్రీ, ప్రై లాంటి వంటకాలను రుచిచూసే అవకాశం లభించనుంది.చేపల ఉత్పత్తులపై అవగాహన పెంచడంతో పాటు చేపల వంటకాలను పరిచయం చేసేందుకు ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.వరంగల్‌లోని సిటీ గ్రౌండ్స్, హనుమకొండలోని నేరెళ్ల వేణు మాధవ్ ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్‌లో ఈ ఫెస్టివల్ జరగనుంది.

అలాగే పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో జరగనుంది.ఇలా అన్ని పట్టణాల్లోనూ ఫిష్ ఫెస్టివల్‌లు నిర్వహించాలని మత్య్సశాఖ అధికారులకు సూచించింది.అనేక రకాల వంటకాలు రుచిచూసే అవకాశం దీని ద్వారా లభించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube