ముగిసిన వీఆర్వోల శకం

రెవెన్యూ శాఖలో వీఆర్వోల చాప్టర్​ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్​ చేసింది.22 నెలల క్రితమే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.వారి డ్యూటీపై తాజాగా నిర్ణయం తీసుకుంది.అయితే రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించింది.విద్యార్హతలు, సీనియారిటీ సంబంధం లేకుండా లాటరీ పద్ధతి ప్రకారం సెలక్ట్ చేసి వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.దీనిపై జీవో121 ప్రభుత్వం విడుదల చేసింది.

 Telangana Government To Adjust Vro In Other Departments Details, Telangana Gover-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల శకం ముగిసింది.అయితే రెండు సంవత్సరాల కిందటే వీఆర్‌వోలను రద్దు చేసిన తెలంగాణప్రభుత్వం 5,294 మందిని లాటరీ ద్వారా పంపింది.కొందరు కొత్త ఉద్యోగాల్లో చేరగా.మిగతావారు రిపోర్ట్ చేశారు.

సీనియారిటీ, విద్యార్హత పరిగణలోకి తీసుకోకుండా సర్థుబాటు ప్రక్రియ పూర్తి చేశారు.

వీఆర్వోలు పని చేసేందుకు ఏ ఏ శాఖలో జూనియర్​ అసిస్టెంట్​కు సమానమైన శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో వెల్లడిస్తూ పలు జిల్లాల కలెక్టర్లు సర్క్యూలర్​ విడుదల చేశారు.

దీంతోపాటు లక్కీ డిప్​ ద్వారా శాఖలు కేటాయించడంతో వీఆర్వోలు కంగుతిన్నారు.కొన్ని జిల్లాల్లోనైతే మంగళవారం మధ్యాహ్నంలోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాష్ట్రంలో 5,385 మంది వీఆర్వోలు ఉండగా.రెవెన్యూ శాఖ మినహా వ్యవసాయం, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, అటవీ, ఆర్థిక, సివిల్ సప్లయ్​, వైద్య, ఆరోగ్య, విద్య, హోం, ఇండస్ట్రీస్, ఇరిగేషన్, లేబర్, మైనార్టీ వెల్ఫేర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శిశు సంక్షేమ శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారు.

లాటరీ పద్ధతిన సెలక్ట్ చేసి పోస్టింగ్ ఇస్తున్నారు.

Telugu Cm Kcr, Telangana, Telangana Vros, Officers-Political

దాదాపు మెజార్టీ జిల్లాల్లో లాటరీ ద్వారా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది.ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకూ అధికారులు గోప్యత పాటించారు.సెలవు, సస్పెన్షన్‌‌ లో ఉన్నవారికి కూడా జిల్లా కేటాఇంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే సీనిరిటీ, విద్యార్హత అన్న సంబంధంలేకుండా లాటరీ పద్దతి ద్వారా సర్దుబాటు చేయడంపై వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంత మందికి వీఆర్వోలకు రెండు దశాబ్దాలకు పైగా సీనియారిటీ ఉంది.

కొన్ని నెలల్లో వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశముంది.అయితే వీరిని ఇతర శాఖలోకి బదిలీ చేయడం వల్ల వీరు సీనియారిటీ కోల్పోతున్నారు.

ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు కూడా ఇతర శాఖలోకి బదిలీ చేస్తే పదోన్నతి వచ్చే అవకాశం లేదు.దీంతో వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube