బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. !

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఇప్పటి వరకు కొందరికే పరిమితం అయిన ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ అధికారులు గుర్తించిన వారికి కూడా ఇవ్వాలని నిర్నయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి కూడా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.కాగా ఈరోజు బి.

ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటుగా వివిధ బ్యాంకుల ప్రతినిధులతో.బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇకపోతే దశల వారిగా కరోనా వ్యాక్సినేషన్ పక్రియ సాగుతుందని ఇప్పటికే కరోనా స్పైడర్లుగా గుర్తించిన వారికి ఈ టీకాలు వేస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే 

తాజా వార్తలు