అన్ని పరీక్షలు వాయిదా .. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.వ‌ర్షాల నేప‌థ్యంలో  యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

 Telangana Government Postponed All Exams Exams, Cancel, Telangana, Sabitha Indr-TeluguStop.com

ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయ‌ని, దీని వ‌ల్ల అన్ని ఎగ్జామ్స్ కొన్ని రోజుల‌పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు.

వర్షాల నేప‌థ్యంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా దసరా వరకు జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

త్వరలోనే అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని పరీక్షలు జరిగే తేదీలను వెల్లడిస్తామని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె చెప్పారు.విద్యార్థులు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాల‌ని ఆమె సూచించారు.

వ‌ర్షాలు త‌గ్గిన త‌ర్వాత ఎగ్జామ్స్ జ‌రుగుతాయ‌ని స‌బితా ఇంద్రారెడ్డి చెప్పారు.

క‌రోనా ప్ర‌భావం, లాక్‌డౌన్ కార‌ణంగా జ‌రగాల్సిన ఎగ్జామ్స్ మొత్తం వాయిదా ప‌డ్డాయి.దీంతో ప‌దో త‌ర‌గ‌తితో పాటు ఇంట‌ర్ విద్యార్థులంద‌రినీ పాస్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.1-9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను పైత‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.ప‌దో త‌ర‌గ‌తితో పాటు ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామంది.అయితే డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయాల‌ని డిమాండ్ అప్ప‌ట్లో వినిపించింది.

అయితే డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం వాయిదా వేయ‌లేదు.దీంతో క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతూ వ‌స్తుండ‌టంతో గ‌త నెల నుంచి ప్ర‌భుత్వాలు తిరిగి ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తున్నాయి.

అందులో భాగంగా తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ గ‌త కొద్దిరోజుల నుంచి జ‌రుగుతున్నాయి.కానీ తెలంగాణ‌లో భారీ వ‌ర్షాల ప‌డుతుండ‌టం, వ‌ర‌ద ప్ర‌భావానికి హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అవుతుండటంతో ఎగ్జామ్స్ అన్నీ వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube